Sunday, December 22, 2024

విధుల్లో ఉన్న సఫాయి కార్మికులపైకి దూసుకెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

- Advertisement -
- Advertisement -

కేరళలో శనివారం నలుగురు పారిశుద్ధ కార్మికులు దుర్మరణం చెందారు. తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ షోరనూర్ రైల్వే స్టేషన్ వద్ద వీరిని ఢీకొంది. ఈ ఘటనలో వీరు చనిపోయినట్లు రైల్వే పోలీసులు ప్రకటన వెలువరించారు. రైల్వే ట్రాక్‌పై చెత్తాచెదారాన్ని తీసివేస్తుండగా వేగంగా వచ్చిన రైలు వీరిని ఢీకొంటూ వెళ్లిందని , రైలును వీరు గమనించకుండా పనిచేస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని ప్రకటనలో తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News