Sunday, January 19, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు..

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మక్తల్ మండలంలోని గొల్లపల్లి స్టేజీ సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన మంగమ్మ(30), చెన్నమ్మ(55), నాగరాజు(37), కృష్ణయ్య(40), యశ్వంత్(06)తో పాటు మరో ఇద్దరు చిన్నారులు మక్తల్‌లో జరుగుతున్న తమ బంధువుల శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో వస్తుండగా, కర్ణాటకలోని దావణగెరెకు చెందిన మహ్మద్ రహ్మతుల్లా నిర్లక్షంగా తన కారును నడుపుతూ వేగంగా దూసుకొచ్చి ఎదురుగా వస్తోన్న కారును ఢీకొట్టింది.

దీంతో మహబూబ్‌నగర్‌కు చెందిన మంగమ్మ, చెన్నమ్మ, కృష్ణయ్య, యశ్వంత్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికుల సహాయంతో బంధువులు మక్తల్ ఆసుపత్రికి తరలించి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన రహ్మతుల్లాకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News