Thursday, January 23, 2025

దోడా జిల్లాలో ఉగ్రవాదుల దాడి: నలుగురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. దెస్సా ప్రాంతంలో గత రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో అధికారితో సహా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దెస్సా ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గత వారం కఠువా జిల్లా మాచేడీలో సైనివాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు మృతి అమరులైన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్ గత రెండున్నర సంవత్సరాల నుంచి 40 మంది సైనికులు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News