Sunday, December 22, 2024

సిక్కింలో రోడ్డు ప్రమాదం.. నలుగురు జవాన్ల మృతి

- Advertisement -
- Advertisement -

గాంగ్‌టక్: సిక్కింలోని పక్యాంగ్ జిల్లాలో గురువారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సైనిక సిబ్బంది మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని బిన్నగురి వద్ద సైన్యానికి చెందిన ఇఎంసి సిబ్బంది వెళుతున్న వాహనం అదుపుతప్పి లోయలోని అడవిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. రెనాక్ రోంగ్లి హైవేపైన భీర్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. వాహనంలో నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారని, వారంతా మరణించారని పోలీసులు తెలిపారు.

మృతులను సిపాయ్ ప్రదీప్ పటేల్(మధ్య ప్రదేశ్), సిఎఫ్‌ఎన్‌డబ్లు పీటర్(ఇంఫాల్ వాసి), నాయక్ గురుసేవ్ సింగ్(హర్యానా), సుబేదార్ కె తనంగపాండి(తమిళనాడు)గా గుర్తించారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదని, దానిపై దర్యాప్తు జరుగుతోందని వారు చెప్పారు. మృతదేహాలను సైన్యానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News