- Advertisement -
జమ్ముకశ్మీర్‌లో పహారా కాసేందుకు వెళ్తున్న ఓ సైనిక వాహనం బందిపొరా లోని వులార్ వ్యూపాయింట్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు సైనికులు మృత్యువాత పడగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలం లోనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా, బందిపొరా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల క్రితం ఫూంచ్ జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గరోనా ప్రాంతం లోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్డును అంచనా వేయలేక పోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
- Advertisement -