Tuesday, November 5, 2024

సికింద్రాబాద్ టు బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ సీజన్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ టు బెనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లును నడుపనుంది. స్లీపర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఈనెల 15వ తేదీ నుంచి 22 తేదీ వరకు నడుపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. రైలు నంబర్ 07005 (సికింద్రాబాద్ -టు బనారస్) సికింద్రాబాద్ నుంచి రాత్రి 9:40 గంటలకు బయలుదేరి నవంబర్ 15, 22 తేదీల్లో ఉదయం 6:30 గంటలకు బనారస్ చేరుకుంటుంది.

అదే విధంగా రైలు నెం 07006 (బనారస్ -టు సికింద్రాబాద్) బనారస్ నుంచి ఉదయం 8:35 గంటలకు బయలుదేరి నవంబర్ 17, 24 తేదీల్లో సాయంత్రం 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, అలాగే ప్రయాగ్రాజ్ స్టేషన్‌లలో రెండు దిశల్లో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News