Sunday, January 19, 2025

కాలేజీ వేడుకలో తొక్కిసలాట..నలుగురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కేరళలోని కొచ్చిలో శుక్రవారం కాలేజీలో జరిగిన సంగీత ఉత్సవం చివరికి నలుగురు విద్యార్థుల ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. తొక్కిసలాటలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వార్షిక టెక్ టెస్టు నేపథ్యంలో ఇక్కడి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో వేడుకగా మ్యూజిక్ ప్రోగ్రాం జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరావడంతో పరిస్థితి శృతిమించింది. తోపులాటలకు దారితీసింది. నలుగురు చనిపోగా , 60 మంది వరకూ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ కాలేజీ అనుబంధంగా ఉంది. వర్శిటీలోని ఓపెన్ ఆడిటోరియంలో ఘటన జరిగిందని విద్యాసంస్థ డైరెక్టర్ పికే బేబీ విలేకరులకు తెలిపారు. ఆడిటోరియంలో వెనుక వైపు ఉన్న వారు ఒక్కసారి ముందుకు దూసుకురావడంతో ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ వేదిక వద్ద రెండువేలకు మించి విద్యార్థులు గుమికూడి ఉన్నట్లు తెలిసింది. గాయపడ్డ వారి పరిస్థితిపై స్పష్టత రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News