Saturday, December 21, 2024

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థినీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పో లీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఫిగ్లిపుర్ గ్రామ పంచాయతీలోని సాయినగర్ కాలనీ చెందిన అబ్దుల్ వాహెబ్ (45) ఇద్దరు కూతుర్లు నైరా నోరిన్ (13), 8వ తరగతి బిస్మ రిజ (12) ఏడవ తరగతి చదువుతున్నారు. సికింద్రాబాద్‌లో గల బంధువుల ఇంటికి వెళ్లి స్కూటీపై సొంత గ్రామానికి తండ్రి కూతుర్లు ముగ్గురు రాత్రి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గల తందూరి హోటల్ వద్ద గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి స్కూటీని ఢీ కొ టింది. ఈ ప్రమాదంలో పెద్ద కూతురు నైరా నొరిన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన చిన్న కూతురునీ, తండ్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కూతురు మృతి చెందారు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

ప్రతాపసింగారం వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  బోడుప్పల్ అశోక్‌నగర్ కాలనీకి చెందిన భూమ సాయికుమార్ (22), అనిత (20) లు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కాగా శుక్రవారం ఉదయం వీరిద్దరు బైకుపై నగరంలోని సంఘీ టెంపుల్‌కు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి (బోడుప్పల్ )వైపు వెళ్తుండగా ప్రతాపసింగారం ప్రధాన రోడ్డులో ఉన్న డబుల్‌బెడ్ రూంల వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న ఉప్పల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలైన సాయికుమార్, అనిత అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం గాంధీ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News