- Advertisement -
నలుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు 19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. దీంతో బాలుర కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్‌పేట్, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ(13), కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి(13), నితీష్ చౌదరి(13), కోరే హర్ష వర్ధన్(13) నలుగురు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నలుగురు కలిసి బుధవారం నుంచి కన్పించకుండా పోయారు. వెంటనే అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాలుర ఆచూకీ తెలిసిన వెంటనే అంబర్‌పేట పోలీసుల ఫోన్ నంబర్లు 8712660590, 8712660593, 8712661269 లో సమాచారం ఇవ్వాలని కోరారు.
- Advertisement -