Monday, January 20, 2025

సిబిఐటి కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నార్సింగి: అతివేగం కారణంగా 4 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. శుక్రవారం ఉదయం గండిపేట మండలం నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని శంకర్ పల్లి ప్రధాన రహదారి ఖానాపూర్ సిబిఐటి కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. టిఏస్07యుకె 9738 నంబరు గల లారీ శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం ఖానాపూర్ గ్రామపోచమ్మ దేవాలయం, సిబిఐటి కళాశాల సమీపంలో లారీని వెనుక నుంచి టిఎస్ 08 జిడబ్లు 3102 నంబరు గల రెనాల్ట్ ట్రైబర్ కారు అతివేగంతో లారీని ఢీన్నడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న 11మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 6మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన 6 మందిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన నలుగురి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న 11మంది విద్యార్ధులు 17 నుంచి 24 సంవత్సరాల లోపువారేనని డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేకపోవటం కారణంగా ప్రమాదం చోటుచేసుకుని ఉండవచ్చని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News