Wednesday, January 22, 2025

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు.

అప్రమత్తమైన భారత సైన్యం కాల్పులు జరిపి వారి యత్నాన్ని భగ్నం చేసింది. గడిచిన వారం రోజుల్లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించటం ఇది రెండోసారి. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించటంతో ఎదురుకాల్పులు జరిగాయి. జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News