Sunday, January 19, 2025

సైబరాబాద్‌లో నలుగురు దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Four thieves arrested in Cyberabad

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దొంగలు అరెస్ట్ అయ్యారు. నిందితులను యాదయ్య, మహదేవ్, రేణుక, అనితగా గుర్తించారు. పట్టుబడిన నలుగురు నిందితులను పాతనేరస్థులుగా పోలీసులు తేల్చారు. మియాపూర్, రామచంద్రాపురంలో 12 నేరాలు చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. యాదయ్య అనే నిందితుడిపై చందానగర్ పోలీస్ స్టేషన్ లో పిడి యాక్ట్ ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి 3.5 తులాల బంగారం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News