Thursday, January 23, 2025

8 రకాల కొత్త వంగడాలు

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణ వ్యవసాయ వర్శిటీ మరో ఘనత
  • వరిలో జాతీయ , రాష్ట్రస్థాయి కమిటీల ఆమోదంతో నాలుగు రకాల వంగడాలు విడుదల
  • రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీ ఆమోదించిన జొన్న, రాగి, సజ్జ పంటల్లో ఒక్కో రకం: ఉపకులపతి ఎం. రఘునందర్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్/రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పంటలలో నూతన వంగడాలను విడుదల చేసింది. వరి , మొక్క జొన్న, రాగి, సజ్జ, జొన్న పంటల్లో ఎనిమిది రకాలను విడుదల చేసినట్లు ఉపకులప తి ఎం. రఘునందర్‌రావు, పరిశోధన సంచాలకులు డా. పి. రఘురామిరెడ్డి మంగళవారం వెల్లడించారు. సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ, వెరైటల్ రిలీజ్ కమిటీ ల ఆదమోదంతో నూతన వంగడాలను విడుదల చేసినట్లు వారు తెలిపారు. వరిలో రాష్ట్ర స్థాయి వెరైటల్ రిలీజ్ కమి టీ ఆమోదించిన రెండు రకాలు, సెంట్రల్ వెరైటల్ రిలీజిం గ్ కమిటీ ఆమోదంతో మరో రెండు రకాలను విడుద ల చే శారు. అలాగే రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీ ఆ మోదించిన జొన్న, రాగి, సజ్జ పంటల్లో ఒక్కో రకం చొ ప్పున వంగడాలను విడుదల చేసినట్లు వివరించారు.

వరిలో విడుదలైన నూతన వంగడాలివే
రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా వరివిస్త్రీరణం గణనీయంగా పెరుగుతూ ఉండడంతో నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో అకో ఏడాదిలో రెండు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందు కోసం తక్కువ కాల వ్యవధితో పాటు అగ్గి తెగులు , సుడిదోమ, ఉల్లికోడు లను తట్టుకొనే రకాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వరిలో కొత్తగా నాలుగు రకాలను రైతులకు ప్రొ. జయశంకర్ వర్శిటీ అందుబాటులోకి తెచ్చింది. రాజేంద్రనగర్ వరి పే రిట ఆర్‌ఎన్‌ఆర్28361 అనే దొడ్డు గింజల రకాన్ని రాష్ట్ర వెరైటల్ కమిటీ ఆమోదంతో విడుదల చేసినట్లు సంచాలకులు తెలిపారు.

తెలంగాణ వరి (కెఎన్‌ఎం7037 ) పేరిట తక్కువ పంట కాలం కలిగిన సన్నని, పొడవైన గింజ, తక్కువ నూక శాతం (దిగుబడి 62.3 కిలోలు), నాణ్యత కలిగిన అన్నం లక్షణాలు కలిగిన ఈ రకాన్ని జాతీయ స్థాయిలో విడుదల చేసినట్లు వివరించారు. సుడి దోమ, అగ్గి తెగులు, ఎండు కోళ్లు తెగులును తట్టుకొనే తెలంగాణ వరి 1289 (డబ్లూజిఎల్1289)ను కూడా జాతీయస్థాయిలో ప్రొ.జయశంకర్ వ ర్శిటీ విడుదల చేసింది. ఇది తెలంగాణతో పాటు చత్తీస్‌గ ఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ సాగు చేయడానికి అనుకూలమైన రకమని డా.రఘురామిరెడ్డి చెప్పారు. ఉల్లికోడు బయోటైప్‌లను తట్టుకొనే వరంగల్ వరి199ను కూడా విడుదల చేయడం జరిగిందని వారు తెలిపారు.

మొక్క జొన్న: కాండం కుళ్లు తెగులు తట్టుకొని అధిక దిగుమడినిచ్చే డిహెచ్‌ఎం206 అనే నూతన మొక్కజొన్న హై బ్రిడ్‌ను జాతీయస్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమైన హైబ్రిడ్ జొన్న.
సజ్జ, రాగి: పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా అధిక ఇనుము, అధిక జింక్ కలిగిన పిబిహెచ్1625 ,సజ్జ హైబ్రిడ్‌ను అలాగే రాగిలో అధిక కాల్షియం కలిగిన పిఆర్‌ఎస్38 రకాన్ని రాష్ట్రస్థాయిలో విడుదల చేశారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత గత 8 ఏళ్ళుగా వివిధ పంటలలో 61 రకాల వంగడాలు రైతులకు అందుబాటులోకి తేవడం జరిగింది. అందులో భాగంగా వరిలో 25 , మొక్క జొన్నలో 2 రకాలు, జొన్న 5 రకాలు, అపరాలు 11, నూనె గింజలు 7, పత్తి ఒక రకం, పశుగ్రాసం పంటలలో 10 రకాలను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. అందులో రాష్ట్రస్థాయి లో 23, జాతీయ స్థాయిలో 38 రకాల వంగడాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News