Friday, December 27, 2024

యుపి రోడ్‌వేస్ బస్సు ఢీకొని నలుగురు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

నొయిడా : బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో నొయిడా వద్ద యుపి రోడ్‌వేస్ బస్సు ఢీకొని నలుగురు ఫ్యాక్టరీ కార్మికులు మృతి చెందారు. మృతులు సంకేశ్వర్ కుమార్ ( 25), మొహ్రీ కుమార్ (22), సతీష్ (25), గోపాల్ (34) గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

బాదల్‌పూర్ ఏరియాలో హీరో మోటార్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తమ నైట్‌షిఫ్టు పూర్తి కాగానే బయటకు వచ్చినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే తెలియజేశారు. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు చెప్పారు. నొయిడా డిపోకు చెందిన ఈ బస్సును స్వాధీనం చేసుకున్నామని, పరారైన డ్రైవర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News