Sunday, December 22, 2024

నాలాలో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని భారీగా కురుస్తున్న వర్షానికి మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బాచుపల్లి నాలాలో మిథున్ అనే బాలుడు కొట్టుకుపోయాడు. నాలాలో కొట్టుకుపోయిన బాలుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడి ఆచూకీ కోసం డీఆర్ఎఫ్ బృందాలు ప్రగతినగర్ తురక చెరువులో గాలిస్తున్నాయి. గాలింపు చర్యలను ఎమ్మెల్యే వివేకానంద పర్యవేక్షిస్తున్నారు. బాలుడు నాలాలో పడిపోతున్న సిసి ఫుటేజీ లభ్యం అయింది.

ఎన్ఆర్ఐ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి కొట్టుకపోయిన బాలుడు… నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడు తేలాడని, బాలుడిని బయటకు తీసే ప్రయత్నం విఫలం అయింది. బాలుడి మృతదేహం మళ్ళీ చెరువులోకి కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. లోతట్టు నాలా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News