Wednesday, January 22, 2025

మలక్‌ పేట్‌లో విషాదం.. ఆస్పత్రిలో నాలుగేళ్ల చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

four-year-old child died in hospital at malakpet

మలక్‌పేట్‌: హైదరాబాద్ మలక్‌పేట్‌లోని ఎంసిహెచ్ కాలనీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. మృతుడు అఖిల్(04) చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఇంజక్షన్ వికటించడంతోనే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News