Tuesday, September 17, 2024

నార్సింగిలో చిన్నారిపై హత్యాచారం.. దోషికి మరణదండన

- Advertisement -
- Advertisement -

నగరంలోని నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి హైకోర్టు మరణ దండన విధించింది. 2018లో నార్సింగిలో చిన్నారిపై సెంట్రింగ్ కార్మికుడు దినేశ్ కుమార్ కిరాతకానికి ఒడిగట్టిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు 2021లో ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని సమర్థించింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఆర్యమిత్ర కార్మిక శిబిరంలో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన దినేష్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017 డిసెంబరు 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుం టున్న వారి కుమార్తె(5)కు చాక్లెట్ల ఆశ చూపి అపహరించుకుపోయాడు.

కార్మిక శిబిరానికి సమీపంలోని నిర్జన ప్రదేశంలోని పూల పొదల వద్ద కు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. పాపకు మెలుకువ వస్తే జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబుతుందనే భయంతో బండరాయితో మోది హత్య చేశాడు. పాప కన్పించడం లేదని తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు పరిసర ప్రాంతాల్లో వెదుకుతుండగా నిందితుడు అమాయకత్వం నటిస్తూ వారిని అనుసరించాడు. చివరిసారిగా చిన్నారి దినేష్ వెంట కనిపించిందనే చిన్న ఆధారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసు కొన్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. లోతుగా విచారించగా నింది తుడు నేరాన్ని అంగీకరిస్తూ జరిగిన ఉదంతాన్ని వెళ్లగక్కాడు. అతడిపై కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరస్థుడికి ఉరి శిక్ష విధించాలని అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డి బలమైన వాదనలు వినిపించారు.

సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడు దినేష్‌కు ఉరిశిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ తుది తీర్పు ఇచ్చారు. దినేష్ కుమార్ హైకోర్టుకు అప్పీలు చేయగాకింది కోర్టు తీర్పును సమర్థిస్తూ దోషికి ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News