Friday, December 20, 2024

గంజాయి తరలిస్తున్న నలుగురు యువకుల అరెస్టు రిమాండ్

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: ఒడిశా నుండి నగరానికి గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ మన్మోహన్ కథనం ప్రకారం…పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన మాయిపల్లి వెంకట్ రంగనాథ్ కర్మన్ ఘాట్‌లో, సూర్యాపేట జిల్లా లింగపల్లి చెందిన డ్రైవర్ మొరపాకల శ్రీనివాస్ కుంట్లూరు సన్‌రైజ్ కాలనీలో మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన నాయిని శ్యామ్ హయత్‌నగర్‌లో, కుంట్లూరుకి చెందిన కారు మెకానికి మారగోని కృష్ణగౌడ్ స్థానికంగానే ఉంటున్నారు.

ఈ నలుగురితో పాటు హయత్‌నగర్‌కు చెందిన విఠల్ మహ్మద్ ఖాసీం, ఒడిశాకు చెందిన అర్జున్‌లు కలిసి ఒడిశాలోని కురమనూర్ గ్రామం నుండి11 కిలోల గంజాయిని హయత్‌నగర్‌కు అక్రమంగా తరలిస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ అనాజ్‌పూర్ వద్ద మహేశ్వరం ఎస్వోటితో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 11 కిలోల ఎండిన గంజాయితో పాటు రెండు బైకులు, నంబర్‌ప్లేట లేని యాక్టివాను, మూడు సెల్ ఫోన్లు, స్వాదీనం చేసుకున్నారు. నింధితులు వెంకట్‌రంగనాథ్, శ్రీనివాస్, శ్యామ్, కృష్ణగౌడ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News