ఢిల్లీ: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు నాలుగో విడుత పోలింగ్ జరుగుతోంది. ఎపి 25, తెలంగాణ 17, ఉత్తర ప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్య ప్రదేశ్ 8, పశ్చిమ బెంగాల్ 8, బిహార్ 5, ఒడిశా 4, ఝార్ఖండ్ 4, జమ్ము కశ్మీర్ ఒక లోక సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు దశలలో 283 స్థానాలకు పోలింగ్ ముగిసింది. నాలుగో దశ పోలింగ్‌తో 379కు చేరుతుంది. నాలుగు విడుత పోలింగ్‌లో పలువురు ప్రముఖ రాజకీయలు పోటీలో ఉన్నారు. బిఎస్‌పి పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టిఎంసి నాయకురాలు మహువా మొయిత్రా, ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, మాజీ క్రికెటర్ యూషఫ్ పఠాన్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసి, కేంద్రమంత్రులు గిరిరాజా సింగ్, రావు సాహెబ్ దాన్వే, నిత్యానంద రాయ్, అజయ్ మిశ్రాలు నాలుగో విడత పోలింగ్ బరిలో ఉన్నారు.
Parliament Elections: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్…
- Advertisement -
- Advertisement -
- Advertisement -