Wednesday, January 22, 2025

కీవ్‌పై భీకర దాడులు

- Advertisement -
- Advertisement -

Fourth round of talks between Russia and Ukraine

నివాస భవనంపై దాడిలో నలుగురు మృతి
మెట్రో స్టేషన్‌పై క్షిపణి దాడి, మూసివేత
కీవ్‌లో రాత్రిపూట కర్ఫూ
రష్యాఉక్రెయిన్ మధ్య నాలుగో విడత చర్చలు
ఉక్రెయిన్‌కు ఇయు దేశాల నేతలు

కీవ్: ఉక్రెయిన్‌పై గత 20 రోజులుగా భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా బలగాలు ఆ దేశ రాజధాని కీవ్‌ను తన గుప్పిట్లోకి తీసుకోవడానికి దాడులను తీవ్రం చేసింది. నివాసప్రాంతాలపైనా విరుచుకు పడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున నగరం భారీ పేలుల శబ్దాలతో దద్దరిల్పియింది. రష్యా పేల్చిన ఫిరంగుల శబ్దాలే అవని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. దాడులను తీవ్రం చేసిన క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రష్యా బలగాలు నగర శివార్లలోని స్వియాటోషిన్‌స్కీ డిస్ట్రిక్ట్‌లోని 16 అంతస్థుల నివాస భవనంపై జరిపిన దాడుల్లో నలుగురు మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలంనుంచి 27 మందిని కాపాడినట్లు తెలిపారు. పోడిల్‌స్క్ ప్రాంతలోని మరో నివాస భవనంపైనా దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. కీవ్‌లోని మెట్రో స్టేషన్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఈ దాడిలో లుక్యానివ్సా మెట్రో స్టేషన్ దెబ్బతిన్నదని కీవ్ మెట్రో నెట్‌వర్క్ ప్రకటించింది. దీంతో మెట్రో స్టేషన్‌ను పూర్తిగా మూసివేసినట్లు తెలిపింది.

పూర్తిగా రష్యా గుప్పిట్లోకి ఖేర్సన్ ప్రాంతం

తమ బలగాలు ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ మంగళవారం ధ్రువీకరించారు. ఖేర్సన్ నగరాన్ని ఈ నెల 3నే రష్యా సైన్యాలు తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు డొనెట్స్‌నుంచి వచ్చిన దళాలు ప్యాంటెలెమోనోమ్‌కా స్థావరంపై నియంత్రణ సాధించాయని ఆర్టీ న్యూస్ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌కు చెందిన 13 డ్రోన్‌లతో సహా 16 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది.

కీవ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ

ఇదిలా ఉండగా కీవ్ నగరంలో మంగళవారం రాత్రినుంచి కర్ఫూ విధించనున్నారు. మంగళవారం చాలా క్లిష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని కీవ్ నగర మేయర్ విటాలి క్లిట్ష్‌కో ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 8గంటలనుంచి గురువారం రాత్రి 7 గంటల వరకు కర్ఫూ కొనసాగుతుందని తెలిపారు. పురుషులంతా రాజధాని నగరానికి తిరిగి రావాలని రష్యా కు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. మరో వైపు యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌నుంచి 30 లక్షలకు పైగా పౌరులు పొరుగు దేవాలకు వెళ్లిపోయారని ఐరాస గణాంకాలు వెలెలడించాయి. వీరిలో 14 లక్షలకు పైగా చిన్నారులే ఉన్నారని యునిసెఫ్ వెల్లడించింది.

ఉక్రెయిన్‌కు ఇయు దేశాధినేతలు

ఇదిలా ఉండగా పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా ప్రధానమంత్రులు మంగళవారం ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిసి ఐరోపా సమాఖ్య మద్దతును తెలియజేయనున్నారు. ఈ అధికారిక పర్యటనను పోలండ్ ప్రభుత్వం ధ్రువీకరించింది. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం కోసం రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సాగిస్తున్న పోరాటానికి మొత్తం యూరోపియన్ యూనియన్ మద్దతు ఉందని చాటిచెప్పడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపింది. చెక్ రిపబ్లిక్ కూడా ఇదే విషయాన్ని తెలిపింది.

మొదలైన నాలుగో విడత చర్చలు

మరో వైపు ఉక్రెయిన్ష్య్రాల మధ్య మంగళవారం నాలుగో విడత చర్చలు ప్రాంభమయ్యాయి. చర్చల్లో పాలొంగంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖెలో పోడోల్యాక్ ఈ విషయాన్ని తెలియజేశారు. కాల్పుల విరమణ, దేశ భూభాగాలనుంచి రష్యా సైన్యాల ఉపసంహరణ తదితర అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించారు. చర్చలు ఆన్‌లైన్ వేదికగా సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాంకేతిక విరామం ప్రకటించి మంగళవారానికి వాయిదా వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News