మొరాకో : మధ్యప్రాచ్య దేశాల్లో కరోనా నాలుగో వేవ్ మొదలైంది. ఆ దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్యం లోని 22 దేశాల్లో టీకా ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని, ఇప్పటికే 15 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు బాగా నమోదయ్యాయని వివరించింది. మొరాకో నుంచి పాకిస్థాన్ వరకు డెల్టా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది. మధ్యధర ప్రాంతం తూర్పున డెల్టా వల్ల మరణాల సంఖ్య పెరిగిందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోని వారంతా ఆస్పత్రి పాలవుతున్నారని తెలిపింది. ఇప్పుడు ఆయా దేశాల్లో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ అహ్మద్ అల్ మందారి తెలిపారు. ఈ దేశాల్లో కేవలం నాలుగు కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. అయితే ఇన్‌ఫెక్షన్లు 55 శాతం, మరణాల రేటు 15 శాతం పెరిగిందని వివరించారు.
Fourth wave of Covid-19 hits Middle East