Monday, December 23, 2024

రూ. 3318,26,60,000

- Advertisement -
- Advertisement -

ఇది ఫాక్స్ కాన్ మరో పెట్టుబడి…తెలంగాణపై అచంచల విశ్వాసం

ఇప్పటికే 150 మిలియన్ల డాలర్లతో కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్
తాజా పెట్టుబడితో మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ 550 మిలియన్ల డాలర్లకు చేరిక
భారీగా పెరగనున్న ఉద్యోగ అవకాశాలు హర్షం వ్యక్తం చేసిన ఐటి మంత్రి కెటిఆర్
ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం దృఢంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్య
తెలంగాణ స్పీడ్‌కు ఇది మరో నిదర్శనమని అభివర్ణన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారుతోంది. పెట్టుబడులకు తె లంగాణ స్వర్గధామంగా నిలుస్తోంది. పరిశ్రమల స్థాపనకు అ నువుగాపెట్టుబడిదారులకు మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అత్యంత పారదర్శకంగా పెట్టుబడిదారులు రా ష్ట్రంలో తమ పరిశ్రమలను నెలకొల్పే విధంగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా గణనీయమైన స్థాయిలో పె ట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రోత్సాహాకాలను సైతం ప్రభుత్వం అందిస్తుంటంతో అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ మరో 400 మిలియన్ డాలర్ల (రూ. 3318,26,60,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు గతం లో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి ఇది అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ మొత్తం పెట్టుబడి 550 మిలియన్ డాలర్లు చేరుతుంది. ఈ మేరకు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. ఫాక్స్‌కాన్ నిర్ణయంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తమకు ఉన్న దృఢమైన బంధానికి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న స్నేహాన్ని గురించి ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో తమ స్నేహం స్థిరంగా ఉందం టూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందన్నారు. తెలంగాణ స్పీడ్‌కు ఇది మరో నిదర్శనమన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొంగరకలాన్‌లో 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ రూ.1,656 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల దాదాపు 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. ఇలానే ఉంటే మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగం గా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు మే 15న కెటిఆర్ భూమి పూజ చేసిన సంగతి విదితమే. ఈ ఏడాది మార్చి3న హోన్ హై ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఫాక్స్‌కాన్ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమమైంది. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యో గ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి. ప్రతిపాదిత ప్లాం ట్ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కార్యకలాపాలు తెలంగాణలోని కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేయడంతో పాటు సంస్థ తన ఉ త్పత్తి సామర్థాన్ని విస్తరించడానికి వీలు కల్పిస్తుందని ఫాక్స్‌కాన్ పేర్కొంది. ఫాక్స్‌కాన్ పెట్టుబడి ద్వారా 25 వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని గతంలో కెటిఆర్ వెల్లడించారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి వి లీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్ ఆపిల్ అతిపెద్ద సరఫరాదారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News