Monday, December 23, 2024

తైవాన్‌కు రండి: కెసిఆర్‌కు ఫ్యాక్స్‌కాన్ సీఈవో లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి  కెసిఆర్‌కు ఫ్యాక్స్‌కాన్  సీఈవో యంగ్‌లియూ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా కొంగరఖాలాన్‌లో ఫ్యాక్స్‌ఖాన్ పార్క్ పెడుతున్నట్లు యంగ్‌లియూ ప్రకటించారు. ఈ పార్క్ ఏర్పాటుకు తమ సహకారం కావాలని అన్నారు. అలాగే కెసిఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తనకు ఏంతో ప్రాముఖ్యత ఇచ్చారని యంగ్‌లియూ తెలిపారు. కొంగరఖలాన్‌లో ఏర్పాటు చేయబోయే పార్క్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం ఇవ్వబోతుందని.. దీనిపై మంత్రి కెటిఆర్  ముందుగానే హామీ ఇచ్చినట్లు లేఖలో తెలిపారు. రాబోయే రోజుల్లో ఫ్యాక్స్‌కాన్‌ పార్క్‌ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాలు రాబోతున్నట్లు చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తైవాన్‌కు మధ్య మైత్రి సంబంధాలు కొనసాగాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News