Wednesday, January 22, 2025

క్రెడిట్ కెటిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎలక్ట్రా నిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచం లోనే శిఖర స్థాయిలో ప్రసిద్ధి పొందిన ‘ హోన్ హై ఫాక్స్ కాన్’ సంస్థ తెలంగాణలో అడుగు పెట్టడం సాధారణ విషయం కాదు. లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించే ఈ మెగా ‘ఫాక్స్ కాన్’ తెలంగాణకు రావడం ఆషామాషీ విషయం అసలే కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు, అనేక రా ష్ట్రాలు ఈ సంస్థ పెట్టుబడుల కోసం పోటా పోటీ పడే పరిస్థితుల్లో కొత్త రాష్ట్రమైన తెలం గాణకు దక్కడం వెనుక ఎనిమిదేళ్ళ శ్రమ వుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గ దర్శకత్వంలో ఈ సంస్థ రాష్ట్రంలో కాలూ నడానికి సూత్రధారి, పాత్రధారి ఐటి పరి శ్రమల మంత్రి కెటిఆర్ అనడంలో అతిశ యోక్తి లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన మరుసటి రోజు నుంచే తైవాన్‌కు చెందిన ఈ పరిశ్రమను తేవడానికి ప్రయత్నాలకు అంకురార్పణ జరిగింది.

అమెరికాలో ఎల క్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమలో విశేష అను భవమున్న సంజయ్ కారంపూడి ఉద్యమం సమయంలో కెటిఆర్‌ను ఒక సందర్భంలో కలుసుకొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలం గాణ రాష్ట్రానికి ఫాక్స్ కాన్ లాంటి సంస్థలు తీసుకు రావాలని కెటిఆర్ ఆయనను కోరా రు. ఈ రంగంలో ఆయనకున్న అనుభవా న్ని, నిపుణతను, అంతర్జాతీయ సంబంధా లను వాడుతూ పరిశ్రమ కోసం తెలంగాణ రావాలని కెటిఆర్ ఆయనను ఆహ్వానిం చా రు. కెటిఆర్‌కు వున్న దూరదృష్టి, దృఢ సం కల్పాన్ని గమనించిన సంజయ్ కారం పూ డి ఆయన ఆహ్వానాన్ని కాదనలేక తెలం గా ణకు వచ్చారు. అప్పుడు మొదలుకుంటే ఎనిమిదేళ్ళ దాకా పరిశ్రమ వచ్చే దాకా తె ర వెనుక సంజయ్ కారంపూడి, కెటిఆర్ ల కృషి ఫలితమే ఫాక్స్ కాన్ సంస్థ ఆవి ర్భా వం ప్రకటన అని చెప్పవచ్చు. కెటిఆర్ సూచన మేరకు సంస్థ తెలంగాణలో ఏర్పాటయ్యే దాకా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచారు.

ఈ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ గురువారం తెలంగాణలో సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించే దాకా దీని వెనక జరిగిన నిరంతర ప్రయత్నాలు ఎవరికీ తెలియవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కెటిఆర్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన సంజయ్ కారంపూడి తైవాన్‌లోని ఫాక్స్ కాన్ సంస్థను రప్పించడానికి మూడు సార్లు అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు ఆ దేశానికి వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఆ స్థాయిలో కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రతి వారం, ప్రతి నెల ఫాక్స్ కాన్ ప్రగతిపై సమీక్షలు జరిగేవి. తైవాన్‌లోని సంస్థ ప్రతినిధులు, చైర్మన్ యంగ్ ల్యూ అడిగే అనేకానేక సందేహాలను కెటిఆర్ నివృత్తి చేశారు. ఇక్కడ ఫాక్స్ కాన్‌ను నెలకొల్పితే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇతరత్రా అనుకూలతలు వారికి అనేక సందర్భాల్లో వివరించారు.

ముఖ్యంగా మౌలిక వసతులు, అర్హులైన మానవ వనరులు, ఇతరత్రా వసతులు గురించి లేఖల ద్వారా తెలియజేశారు. కెటిఆర్ బృందం నిరంతరం జరిపిన ప్రయత్నాలు, ప్రభుత్వం తరపున ఇచ్చిన భరోసా ఫాక్స్ కాన్ సంస్థలో భరోసాను నింపింది. చివరకు ఎన్ని రాష్ట్రాల నుంచి, ఎన్ని దేశాల నుంచి ఆహ్వానాలు అందినా ఫాక్స్ కాన్ తెలంగాణకే జై కొట్టింది. చివరకు చైర్మన్ హైదరాబాద్‌కు వచ్చి సంస్థ ఏర్పాటును ప్రకటించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ రాష్ట్ర బహుముఖ అభివృద్ధిపై ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్ చైర్మన్‌ను మరింతగా ఆకట్టుకొన్నది.

కేవలం ఎనిమిదేళ్ళలో రాష్ట్ర ప్రగతిని బహుముఖంగా అభివృద్ధి చేసిన తీరును ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ ప్రశంసించారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు వున్న సానుకూల విధానాలు, ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్మాణాత్మక, నిలకడైన తీరును చూసి ఆయన మంత్రముగ్ధులు కాక తప్పలేదు. ఈ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చారు. కాని ఇక్కడి పాలకులు పారిశ్రామికాభివృద్ధికి చేస్తున్న కృషి, తపనను యంగ్ ల్యూ అర్థం చేసుకొన్నారు. ఒకటే కాదు అనేక యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తామని సంతోషంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News