Saturday, November 23, 2024

చిప్ తయారీ రాయితీలకు వేరుగా దరఖాస్తు చేస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెమికండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రోగ్రామ్ కింద రాయితీల కోసం దరఖాస్తు చేయనున్నామని, భారత్ కేంద్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తైవాన్ చిప్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్రకటించింది. వేదాంత లిమిటెడ్‌తో 19.5 బిలియన్ డాలర్ల చిప్ తయారీ జాయింట్ వెంచర్ నుండి వైదొలుగుతున్నామని ప్రకటించిన మరుసటి రోజు తర్వాత ఫాక్స్‌కాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఫాక్స్‌కాన్‌ను హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్‌గా కూడా పిలుస్తారు. అయితే సెమికండక్టర్స్, డిస్‌ప్లే ఫ్యాబ్ ఎకోసిస్టమ్ కోసం మార్పులతో కూడిన ప్రోగ్రామ్‌తో దరఖాస్తును సమర్పించనున్నామని కంపెనీ తెలిపింది. సరైన భాగస్వాముల కోసం ప్రయత్నిస్తున్నామని, ఫ్యాబ్ నిర్మాణం సవాలుతో కూడినదని, అయితే భారత్‌లో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గుజరాత్‌లో చిప్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు గాను 2022లో ఫాక్స్‌కాన్, వేదాంత మధ్య ఒప్పందం జరిగింది. జాయింట్ వెంచర్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్‌కాన్ తీసుకున్న నిర్ణయంతో భారత్ సెమికండక్టర్ లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News