Sunday, December 22, 2024

వ్యవసాయ బావిలో పడిన నక్కలు

- Advertisement -
- Advertisement -

నెక్కొండ: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు శివారులో మల్లూరు సదయ్యకు చెందిన వ్యవసాయ బావిలో గురువారం రాత్రి ప్రమాదవశాత్త్తూ రెండు నక్కలు పడిపోయాయి. శుక్రవారం ఉదయం పలువురు రైతులు అటువైపు వెళ్లి చూడగా బావిలో పడిన రెండు నక్కల్లో ఒకటి మృత్యువాత పడింది. వెంటనే వారు నర్సంపేట రేంజ్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

దీంతో నెక్కొండ బీట్ ఆఫీసర్ వ్యవసాయ బావి వద్దకు చేరుకుని మృత్యువాత పడిన నక్కతోపాటు సజీవంగా ఉన్న నక్కను బయటకు తీశారు. మృతి చెందిన నక్కకు పంచనామా చేసి అక్కడే ఖననం చేశారు. బతికి బయటపడ్డ నక్కను అధికారులు అడవిలో వదిలేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సరితరెడ్డి, నెక్కొండ బీట్ ఆఫీసర్ పూల్య, బేస్ క్యాంప్ టీం సభ్యులు నాగరాజు, ప్రశాంత్, సంతోష్, స్థానిక రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News