Wednesday, January 22, 2025

ఎస్టీపీ ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటుతాం: దాన కిషోర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన హరితోత్సవంలో జలమండలి ఎండీ దాన కిశోర్ ఫతేనగర్ మురుగు నీటి శుద్ధి కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ కొత్తగా నిర్మిస్తున్న 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశ మల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాకా (సింహాచ్లం సంపంగి) వంటి మొక్కల్ని నాటే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మొక్కలు ఎస్టీపీల నుంచి వచ్చే దుర్వాసన అరికట్టి సువాసనను వెద జల్లుతాయని తెలిపారు. ఆక్సిజన్ అధికంగా ఉత్పత్తి చేసే అల్లనేరేడు, మహాగని, బిగ్నోనియా లాంటి మొదలగు మొక్కలు నాటుతున్నామన్నారు. ఇప్పటికే ఉన్న ఆయా ఎస్టీపీల వద్ద ఆహ్లాదకర వాతావరణం, పచ్చదనం కోసం పలు మొక్కలు నాటినట్లు గుర్తు చేశారు. హరితోత్సవం సందర్భంగా జలమండలి ఆద్వర్యంలోని అన్ని ఎస్టీపీల ప్రాంగణాల్లో ఈడీ, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, ఎస్టీపీ సీజీఎం, జీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News