Monday, November 25, 2024

భారతీయ ఆస్ట్రాజెనెకా టీకా వేసుకుంటే ఫ్రాన్స్ వెళ్ల వచ్చు

- Advertisement -
- Advertisement -

France allows passengers with Indian-made AstraZeneca vaccine

ఆదివారం నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రవేశం

పారిస్: భారత్‌లో తయారయ్యే ఆస్ట్రాజెనెకా టీకాను వేయించుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను తమ దేశంలో ప్రవేశించడానికి ఎట్టకేలకు ఫ్రాన్స్ అనుమతించింది. ఆదివారం నుంచి ఇది ప్రారంభమౌతుంది. ఇదే సమయంలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోడానికి, ఆస్పత్రులను పరిరక్షించడానికి సరిహద్దు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసింది. ఇంతవరకు ఐరోపాలో తయారయ్యే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను వేయిచుకున్న వారికి మాత్రమే ఫ్రాన్స్ అనుమతించేది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తడంతో ఫ్రాన్స్ ఎట్టకేలకు దిగివచ్చింది. భారత్‌లో తయారయ్యే ఆస్ట్రాజెనెకా టీకాను ఇతర ఐరోపా దేశాలు ఇప్పటికే అనుమతిస్తున్నాయి.

బ్రిటన్, ఆఫ్రికాలలో ఆస్ట్రాజెనెకా టీకా విరివిగా వినియోగమౌతోంది కూడా. అయితే దేశాల వారీగా విభిన్నమైన నిబంధనలు అమలు కావడం ఈ వేసవి పర్యటనలకు సంక్లిష్టంగా మారింది. ఫ్రాన్స్ ఇప్పటికీ చైనా, రష్యా టీకాలను గుర్తించడం లేదు. ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన ఫైజర్ /బయోయెన్ టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ , ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లనే ఫ్రాన్స్ అనుమతిస్తోంది. ఆదివారం నుంచి ప్రయాణికులకు అనుమతిస్తున్న నేపథ్యంలో బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్, గ్రీస్ లేదా సైప్రస్ నుంచి ఎవరైనా టీకాలు వేయించుకోకుండా వస్తే 24 గంటల్లో నెగిటివ్ టెస్ట్ చూపించాలి. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున టునీషియా, ఇండోనేసియా, క్యూబా, మొజాంబిక్ దేశాలు ప్రాన్స్ రెడ్‌లిస్టులో ఉన్నాయి. అయితే ఈ దేశాల వారు ఎవరైనా ప్రయాణించదలచుకుంటే పూర్తిగా వ్యాక్సిన్ చేయించుకుంటేనే ఫ్రాన్స్ ప్రవేశానికి అనుమతిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News