Sunday, December 22, 2024

పారిస్‌లో బగ్స్ టెర్రర్..

- Advertisement -
- Advertisement -

పారిస్ : ఫ్రాన్స్ మహానగరం పారిస్‌లో నల్లుల బెడద నానాటికి హడలెత్తిస్తోంది. ఇండ్లల్లో , రెస్టారెంట్లల్లో, రైళ్లలో, బస్సుల్లో ఎక్కడపడితే అక్కడ నల్లులు విస్తరించుకుంటూ పోవడం , మనిషిని నిద్ర పట్టనివ్వని స్థితికి దిగజార్చడం కలవరానికి దారితీసింది. సోషల్ మీడియాలో పలుసార్లు ఈ నల్లుల కాట్లు , ఇవి యధేచ్చగా పెరుగుతూ పోతూ ఉండటంపై నెటిజన్లు ఫోటోలు పెడుతున్నారు. టెర్రరిస్టుల కంటే బగ్స్ మరీ పగపట్టినట్లుగా మారాయని పౌరులు వాపోతున్నారు. హైస్పీడ్ రైళ్లు, మెట్రోరైళ్లు, ఈఫిల్ టవర్ కదిలే బస్సులు ఎక్కడ చూస్తే అక్కడ అంతా తామే అంటూ కన్పిస్తున్నాయని జనం హడలిపోతున్నారు. సినిమా హాళ్లలో, ఛార్లెస్ డి గౌలె ఎయిర్‌పోర్టులోనూ పాకుతున్న నల్లుల గురించి వార్తలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో ఒలంపిక్స్, పారా ఒలంపిక్ గేమ్స్ జరుగుతాయి. అప్పటిలోగా ఈ బెడద తొలిగిపోవాలని లేకుంటే అంతర్జాతీయంగా పరువు పోతుందని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.

పరిస్థితి అదుపు తప్పిందని పారిస్ డిప్యూటీ మేయర్ ఎమ్మాన్యుయెల్ ఎలిసబెత్ బోర్నే తెలిపారు. పారిస్‌కు రోజూ 30 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారని అంచనా. ఇది కూడా నల్లుల బెడదకు ప్రధాన కారణం అయింది. వచ్చే వారం తాను రవాణా సంస్థలతో విషయంపై మాట్లాడుతానని రవాణా మంత్రి క్లెమెంట్ బియానూ తెలిపారు. కొంతకాలం క్రితం వరకూ దేశంలోనే కాకుండా ఫ్రాన్స్‌లోనూ నల్లుల బెడద దాదాపుగా అంతరించిపోయిందనే విశ్లేషణ వెలువడింది. అయితే ఇటీవలి కాలంలో విశేషరీతిలో వెల్లువెత్తిన నల్లుల బెడద చివరికి రసాయనిక స్ప్రేలకు ఇతరత్రా మందులకు కూడా అంతం కాకుండా నిలుస్తున్నాయి. వీటితో శరీరంపై దద్దుర్లు ఏర్పడటం , నిద్రలేమి చివరికి మానసిక ఆందోళన వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇంతవరకూ కరోనా తరువాత లాక్‌డౌన్లు ఇప్పుడు అంతుచిక్కని నల్లుల బెడదతో సతమమమవుతున్నామని పారిస్ వాలాలు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News