Sunday, December 22, 2024

సెమీ ఫైనల్లో ఫ్రాన్స్

- Advertisement -
- Advertisement -

బెర్లిన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ టీమ్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ పెనాల్టీ షూటౌట్‌లో పోర్చుగల్‌ను ఓడించింది. పెనాల్టీ షూటౌట్ ద్వారా మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. షూటౌట్‌లో ఫ్రాన్స్ 53తో విజయం సాధించిం ది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు అదనపు సమయాన్ని కేటాయించారు. ఇందులో కూడా ఇరు జట్లు గోల్స్ సాధించడంలో తేలిపోయాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌లో అనివార్యమయ్యాయి. ఇందులో ఆధిపత్యాన్ని చెలాయించిన ఫ్రాన్స్ చిరస్మరణీయ విజయంతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. షూటౌట్‌లో పోర్చుగల్ మూడు గోల్స్ మాత్రమే సాధించగా, ఫ్రాన్స్ ఐదింటిని గోల్స్‌గా మార్చడంలో సఫలమైంది. కాగా, నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్స్ కోసం సర్వం ఒడ్డినా ఫలితం లేకుండా పోయింది. ఇరు జట్ల గోల్ కీపర్లు అసాధారణ ప్రతిభను కనబరచడంతో గోల్స్ లభించలేదు. కాగా, బుధవారం జరిగే సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News