Thursday, January 9, 2025

ఐరోపా జోలికొస్తే అసలు సహించం: ఫ్రాన్స్

- Advertisement -
- Advertisement -

ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని ఫ్రాన్స్ హెచ్చరించింది. తాజాగా గ్రీన్‌ల్యాండ్ విలీనంపై ట్రంప్ వ్యాఖ్యానించడం ఐరోపా సమాఖ్యలో కలకలం సృష్టించింది. “ మాది బలమైన ఖండం . డెన్మార్క్‌లో దాదాపు 600 ఏళ్ల నాటి నుంచి భాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను, అలానే పనామా కాల్వను అమెరికా ఆక్రమించుకుంటుందంటే నేను నమ్మను. పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకొనేవారు మాత్రమే తట్టుకోగలిగే యుగంలో ఉన్నామా అంటే … అవును అనే చెబుతాను. ఐరోపా సమాఖ్య అతిగా ఆందోళన చెందడం కానీ, బెదరడం కానీ చేయకూడదు.

మేల్కొని బలోపేతం కావాలి ” అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయల్ బార్రోట్ పేర్కొన్నారు. ఆయన ఫ్రాన్స్ ఇంటర్ రేడియో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ ల్యాండ్‌పై సైనిక శక్తిని వాడబోనని ఎలాంటి హామీ ఇవ్వలేనంటూ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆయన దాదాపు కొన్నేళ్ల నుంచి గ్రీన్ ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆయన తొలి విడత పాలనలో ఈ దిశగా కొంత ప్రయత్నం చేసినా ఫలితం లభించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News