Monday, January 20, 2025

లైంగిక ఆరోపణలపై 91 ఏళ్ల కెనడా బిలియనీర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణపై కెనడాకు చెందిన బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత షరతులతో కూడిన బెయిల్ పై ఆయన విడుదల అయ్యారు. ఆయనపై పోలీసులు అనేక అభియోగాలు మోపారు. 1980 నుంచి 2023 మధ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పీల్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఫ్రాంక్ స్ట్రోనాచ్ కెనడా వ్యాపార ప్రముఖులలో ఒకరు. ఆయన గుర్రపు పందాలలో కూడా పెట్టుబడి పెట్టారు. 2010లో కంపెనీ నియంత్రణను వదులుకున్నప్పటి నుంచి స్ట్రోనాచ్ కు మాగ్నాఇంటర్నేషనల్ తో ఎలాంటి అనుబంధం లేదని మాగ్నా ప్రతినిధి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News