- Advertisement -
- రూ.11వేలకు ఒప్పందం
- బాబాలకు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
మన తెలంగాణ/మోత్కురు: మోత్కర్ మండలం పనకబండ గ్రామంలో ఆంజనేయస్వామి మాలలో కొందరు వ్యక్తులు అన్న ప్రసాదం వితరణ చేయాలని ఇంటింటికి తిరుగుతూ వసూళ్లు చేస్తున్నారు. అంతేకాక.. గ్రామానిలో కిరాణా షాపు నడుపుతున్న సతీష్ అనే వ్యక్తికి నరదిష్టి ఉందని.. పూజ చేసుకుంటే పిల్లలు పుడతారని మాయమాటలు చెప్పి రూ.19 వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని రూ.11వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.2,300 ఫోన్ ద్వారా బాధితులు చెల్లించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి గ్రామస్తులకు తెలియడంతో బాబాలను పట్టుకొని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.
- Advertisement -