Wednesday, January 22, 2025

పెట్టుబడుల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

ఇద్దరి అరెస్టు, పరారీలో మరో నిందితుడు
రూ.2.5కోట్లు మోసం చేసిన నిందితులు
రూ.6లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల అదుపులో నిందితులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులు ఇప్పటి వరకు రూ.2.5కోట్లు దోచుకోగా బ్యాంక్‌లో ఉన్న రూ.6లక్షలను సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. హర్యానా రాష్ట్రం, ఫరీదాబాద్‌కు చెందిన హిమాన్షు, ప్రవీణ్, ఢిల్లీకి చెందిన దేవేందర్ పంచల్ కలిసి మోసం చేస్తున్నారు. ముగ్గురు నిందితులు కలిసి నకిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు తయారు చేసి వాటితో బ్యాంక్ కరెంట్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు.

ప్రవీణ్‌కు ఆధార్ సెంటర్ ఉండడంతో నకిలీ ఆధార్‌కార్డులు, పాన్ కార్డులు తయారు చేయడం సులభంగా మారింది. నిందితులు బ్యాంక్ ఖాతాలను ఐసిఐసిఐ బ్యాంక్‌లో ఖాతాలు తీస్తున్నారు. నిందితులు రుచికా ఇన్ఫోసిస్టమ్స్ పేరుతో బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి రూ.2.5కోట్లను దోచుకున్నారు. ముగ్గురు నిందితులు పార్ట్‌టైమ్ జాబ్, పెట్టుబడుల పేరుతో పలువురు బాధితులకు ఫోన్ చేస్తున్నారు. వారి మాటలు నమ్మిన బాధితుల నుంచి డబ్బులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అమీర్‌పేటకు చెందిన బాధితుడి పార్ట్‌టైమ్ జాబ్ పేరు చెప్పి పలు దఫాలుగా రూ.4.75లక్షలు దోచుకున్నారు.

అయినా కూడా మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రసాదరావు, పిసిలు భాస్కర్, మురళికృష్ణ, క్రాంతికుమార్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News