Tuesday, November 5, 2024

పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

రూ.2,38లక్షలు మోసపోయిన బాధితురాలు
నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేసిన సైబర్ నేరస్థులకు బ్యాంక్ ఖాతా ఇచ్చిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.5లక్షల నగదు, 37 చెక్‌బుక్‌లు, 38డెబిట్ కార్డులు, 11 పాస్‌బుక్‌లు, రబ్బర్ స్టాంపులు, 12 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. మహారాష్ట్ర, ముంబాయికి చెందిన మహ్మద్ సోయబ్‌బబ్లూ ఖాన్ సైబర్ నేరస్థులతో కలిసి అమాయకులను మోసం చేస్తున్నాడు.

పార్ట్‌టైం జాబ్ పేరుతో వాట్సాప్, టెలీగ్రాంలో మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాటిని నమ్మిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. ఇంటి వద్ద కూర్చునే సంపాదించవచ్చని నమ్మిస్తున్నారు. నగరానికి చెందిన బాధితురాలి వాట్సాప్‌లో ఇంటి వద్ద ఉండి డబ్బులు సంపాదించవచ్చని మెసేజ్ వచ్చింది. నిందితులు బాధితురాలిని ముందగా నమ్మించేందుకు రూ.500 బోనస్ పంపించారు. చాలా డబ్బులు పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయని నమ్మించారు.

దీంతో బాధితురాలు వారి మాటలు నమ్మి రూ.2,38,405 పంపించింది. డబ్బులు అందినప్పటి నుంచి సైబర్ నేరస్థులు స్పందించడం మానివేశారు. దీంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సైబర్ నేరస్థులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చి లక్ష రూపాయలు తీసుకున్నాడు. నిందితుడిపై దేశవ్యాప్తంగా 42 కేసులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇన్స్‌స్పెక్టర్ నరేష్, ఎస్సై శైలేంద్ర, హెడ్‌కానిస్టేబుల్స్ వెంకటేష్, మహ్మద్ ఫిరోజ్, మహేశ్వర్‌రెడ్డి, పిసి రవి తదితరులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News