Monday, December 23, 2024

పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

రూ.49.45లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్థులు
బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరి అరెస్టు

మనతెలంగాణ, సిటిబ్యూరోః పార్ట్ టైం ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరు యువకులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, చెక్‌బుక్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కేరళ రాష్ట్రానికి చెందిన జానీ, మనువల్ను సైబర్ నేరస్థులకు బ్యాంక్‌ఖాతాలు ఇస్తున్నారు. నగరానికి చెందిన బాధితురాలికి వాట్సాప్‌లో దుబాయ్‌కి చెందిన రైసుల్ పరిచయమయ్యాడు.

తర్వాత ఆమెను టెలీగ్రాం క్రిప్టో కరెన్సీ గ్రూపులో యాడ్ చేశాడు. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. దీనికి తోడు రైసుల్ తనుచరులు తమకు ఇందులో చేరడంతో అధికంగా లాభాలు వచ్చాయని వారి స్క్రీన్ షాట్లు పెట్టారు. దానిని చూసి నమ్మిన బాధితురాలు వారు చెప్పిన క్రిప్టో ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. దశలవారీగా అందులో రూ.49.45లక్షలు పెట్టుబడి పెట్టింది. బాధితురాలు పంపించిన డబ్బులు జానీ, మనువల్ను బ్యాంక్ ఖాతాలకు వెళ్లాయి.

ఇద్దరు నిందితులు ఇచ్చి బ్యాంక్ ఖాతాల్లోకి దేశవ్యాప్తంగా 50కి పైగా సైబర్ నేరాలకు ఉపయోగించారు. అందులో ఎనిమిది కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. కొద్ది రోజులు తర్వాత యాప్ పనిచేయడం ఆగిపోయింది. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరు నిదితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ మట్టం రాజు, సునీల్‌కుమార్, ఎంజి మధుసూదన్, అశోక్‌కుమార్ తదితరులు దర్యాపుత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News