Saturday, December 28, 2024

సిఎం కార్యాలయంలో ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ నగరంలో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అత్తిలి సాయి అనే వ్యక్తి ఏడాది కాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఎల్బీ నగర్‌ ఎస్వోటీ పోలీసులు అత్తిలి సాయిని అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నాడు. నిందితుడి వద్ద సీఎం, హోంమంత్రి పేర్లతో  లెటర్‌ప్యాడ్స్‌ గుర్తించారు. ఏడాది కాలంగా వందల మందిని మోసం చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News