Friday, November 22, 2024

ఫిజులో డిస్కౌంట్ పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్ విద్యార్థులను మోసం చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, తిరుమలగిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ అక్కడ సెమిస్టర్ ఫీజు చేల్లించాల్సి ఉండగా నిందితుడు 10శాతం డిస్కౌంట్ ఇస్తామని చెప్పాడు. ఎపికిచెందిన కనోళ్ల అశోక్‌కుమార్ బాధితుడికి చెప్పాడు. అశోక్, అమెరికాలో ఉంటున్న తరుణ్, ఢిల్లీకి చెందిన వాకర్ అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల ప్రాసెస్ చేసే కన్సల్‌టెన్సీల్లో పనిచేశారు.

దీంతో వీరి వద్ద అమెరికా వెళ్లిన విద్యార్థుల డేటా మొత్తం వీరి వద్ద ఉంది. అందులో నగరానికి చెందిన విద్యార్థిని సంప్రదించాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు నిందితుడికి సెమిస్టర్ ఫీజు చెల్లించమని రూ.4,38,599 ఇచ్చాడు. కానీ నిందితుడు ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీ ఫీజు చెల్లించనట్లు ఉండడంతో బాధితుడు మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ కిరణ్, ఎస్సై సురేష్, హెచ్‌సి నార్సింగ్, పిసిలు గోవింద్ రావు, రవిశంకర్, వెంకటేష్, రాజేష్‌కుమార్, రాములు, వంశీ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News