Thursday, April 10, 2025

నకిలీ వీసాలతో మోసం

- Advertisement -
- Advertisement -

Fraud with fake visas

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ వీసాల తో అమాయకులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వివరాల ప్రకారం… మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్ సర్ఫరాజ్(25) గత కొద్దిరోజులుగా నకిలీ వీసాలు సృష్టించటంతో పాటు నకిలీ ఎయిర్లైన్స్ టిక్కెట్ ను తయారు చేసి విదేశాలకు పంపిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్నాడు. ఇతనిపై రాచకొండ హైదరాబాద్ కమ్యూనిస్ట్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం మెహిదీపట్నంలోని దిల్షాద్ కాలనీలో ఓ ఇంట్లో ఉన్నాడన్న విశ్వాసం స్థానికుల సమాచారం మేరకు దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి పదమూడు ఫెక్ వీసాలు పదమూడు ఫేక్ అగ్రిమెంట్లతో పాటు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News