Monday, December 23, 2024

మోడీ.. ఇదేం తొండి

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే అవకా శాలకు ఆర్‌బిఐ రూపంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ గం డికొట్టిందనే విమర్శలు తా రాస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 24న ఆర్‌బిఐ నిర్వ హించే రాష్ట్రాల సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏకంగా 15 రాష్ట్రాలు పాల్గొనేందుకు అనుమతు లు మంజూరు చేసిన ఆర్‌బిఐ తెలం గాణ రాష్ట్రానికి అనుమతులు ఇవ్వక పోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ 15 రాష్ట్రాలకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏకంగా రూ.25,650 కోట్ల రుణాల రూపంలో నిధులు ల భించనున్నాయి. కానీ ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం బా ధాకరమని కొందరు సీనియర్ అధి కారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఏ రాష్ట్రమైన సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని నిధులను సమీకరించుకునే హక్కు ఉందని, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆ ప్రాథ మిక హక్కును కూడా కేంద్రం,

ఆర్‌బిఐలు కాలరాస్తున్నాయని, ఇంతకంటే ఒక రాష్ట్రాన్ని వేధించడం మరేముంటుంది అని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించిన రాష్ట్రాలన్నింటికీ బాండ్ల వేలంలో పాల్గొనే అవకాశాలు కల్పించిన కేంద్రం (ఆర్‌బిఐ) ఒక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి సవాలక్ష రూల్స్ మాట్లాడుతూ వేలంలో పాల్గొనే అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాల జిడిపిలో 54 శాతం అప్పులు చేసి అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి సైతం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన ఆర్‌బిఐ తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు ఇవ్వలేదని, ఇది ముమ్మాటికీ పక్షపాత చర్యేనని వాపోతున్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం జిడిపిలో ఏ రాష్ట్రమైనా 20 శాతం లోగానే అప్పులు చేయాల్సి ఉందని, ఆ లెక్కన ప్రస్తుతం బాండ్ల వేలంలో పాల్గొంటున్న 15 రాష్ట్రాలు సగటున 27 శాతానికి మించి అప్పులు చేసిన రాష్ట్రాలేనని వివరించారు.

సుమారు 28 శాతం అప్పులు చేసిన తమిళనాడు రాష్ట్రం ఏకంగా 6వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనేందుకు ఆర్‌బిఐ అనుమతులు మంజూరు చేసింది. అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం మరో 500 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు బాండ్ల వేలంలో పాల్గొంటోందని, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా వెయ్యి కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు ఆర్‌బిఐ అనుమతులు ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి 2022 ఏప్రిల్ నెల నుంచి బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అనుమతులు నిరాకరిస్తూ వస్తున్న ఆర్‌బిఐ ఈనెల 24వ తేదీన జరుగనున్న బాండ్ల వేలంలో పాల్గొనేందుకు అనుమతులు ఇవ్వలేదని, వాస్తవానికి తాజా లెక్కల ప్రకారం తెలంగాణ చేసిన అప్పులు 19 శాతానికి పడిపోయాయని, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం అప్పుల్లో ఒక శాతం తక్కువగానే ఉన్నామని తెలిపారు. 2022వ ఏడాదిలో నాలుగుసార్లు మాత్రమే వేలంలో పాల్గొనేందుకు అనుమతులు ఇచ్చిన ఆర్‌బిఐ భారీగా కోతలు విధించిందని తెలిపారు.

ఈనెల 24వ తేదీన జరుగనున్న వేలంలో పాల్గొనే 15 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1000 కోట్లు, అస్సాం రూ.800 కోట్లు, గోవాకు రూ.100 కోట్లు, గుజరాత్‌కు రూ.1000 కోట్లు, హర్యానా రూ.1000 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు, కేరళ రాష్ట్రానికి రూ.1500 కోట్లు, మహారాష్ట్రకు రూ.5 వేల కోట్లు, మణిపూర్‌కు 150 కోట్లు, మిజోరాంకు రూ.100 కోట్లు, పంజాబ్‌కు రూ.500 కోట్లు, రాజస్థాన్‌కు రూ.1,500 కోట్లు, తమిళనాడుకు రూ.6 వేల కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,500 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.2 వేల కోట్ల నిధులు అందనున్నాయి. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం దేశం యావత్తూ 60 శాతం మాత్రమే అప్పులు చేయాలని, అందులో కేంద్ర ప్రభుత్వం 40 శాతం మేరకు అప్పులు తెచ్చుకోవచ్చునని, మిగిలిన 20 శాతం వరకూ రాష్ట్రాలు అప్పులు చేసుకోవచ్చునని ఆ చట్టం చెబుతోందని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వమే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి 84 శాతం వరకూ అప్పులు తెచ్చిందని, ప్రస్తుతం దేశం అప్పులు 152,17,910 కోట్ల రూపాయల మేరకు అప్పులున్నాయని వివరించారు.

దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు మాత్రమే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి నడుచుకొంటున్నాయని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం, ఆర్‌బిఐలు ఎందుకిలా వ్యవహరిస్తున్నాయో అంతుబట్టడంలేదని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యాయానికి ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి, సంక్షేమ పథకాలు భేషుగ్గా ఉన్నప్పుడు, ప్రజల కొనుగోలు శక్తిని భారీగా పెంచినప్పుడు, రాష్ట్రాల జిఎస్‌డిపిలను భారీగా పెంచి సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా రాజకీయాలను పక్కనబెట్టి ఇతోధికంగా ప్రోత్సహిస్తూ వచ్చాయని, కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే బాగా పనిచేసే తెలంగాణ వంటి రాష్ట్రానికి ఇలా అన్యాయం చేయడం విడ్డూరంగా ఉందని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థ్ధికంగా దెబ్బ కొడుతూ కేంద్ర ప్రభుత్వం ఏం సాధిస్తుందో అర్ధంకావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News