హైదరాబాద్ ః నగరంలోని పేదల ప్రజలకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నేటి నుంచి ఈనెల 20వ తేదీవరకు ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్దారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు. బుధవారం వారు ఒక ప్రకటనలో పేర్కొంఊ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు యాడ్ లైఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్వహించే ఈ శిబిరంలో ఉచితంగా క్యాన్సర్ నిర్దారణకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు .
ప్రాథమిక పరీక్షల అనంతరం ఎవరికైనా వైద్యులు మెమోగ్రమ్ వంటి మరేదైనా వ్యాధి నిర్దారణ పరీక్ష నిర్వహించాలని నిర్ణయిస్తే వాటి కయ్యే వ్యయంలో మమ్మోగ్రామ్ 25శాతం ,ఇతర పరీక్షలకు 10 తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.ఈ ఉచిత వ్యాధి నిర్దారణ శిబిరం గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన చిరునామా – బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ,రోడ్ నే0 14 బంజారాహిల్స్ హైదరాబాద్ దింతో పాటు 040 23551235 extn 2354 – 040 23550967/ టెలిఫోన్ నెంబర్లు ను కూడా సంప్రదించగలరని తెలిపారు.