Wednesday, December 25, 2024

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. సీటు కోసం మహిళల పోట్లాట!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హై-దరాబాద్ : ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కిందట మహిళకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైన దగ్గర నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో సారి కూడా వార్తల్లో నిలిచింది. బస్సులో సీటు కోసం పలువురు మహిళలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జహీరాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ముప్పై సెకన్ల క్లిప్‌లో పలువురు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు. వారి గొడవ చూసి బస్సులో ఉన్న చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. వారి మధ్య ఘర్షణను నివారించేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించారు. కొంత సమయం తరువాత ఆ గొడవ సద్దు మనిగింది. కాగా.. ఆ బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఇప్పుడు ఆ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలైన తరువాత బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆర్‌టిసి బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతోంది. గతంలో 69 శాతం ఉన్న ఈ రేషియో ఇప్పుడు 89 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. గతంలో ఆర్‌టిసి బస్సుల్లో 12 నుంచి 14 లక్షల మంది ప్రయాణిస్తుండగా ఇప్పుడు ఇప్పుడు 29 లక్షలకు చేరింది. అయితే బస్సుల్లో మహిళలతో నిండిపోతుండటంతో పురుషులు ఇబ్బందులకు గురౌతున్నారు. అందుకే ఆర్‌టసి అవసరమైన రూట్లలో, సమయాలలో పురుషులకు ప్రత్యేక బస్సులు నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచనకు పదును పెడుతోంది. అదే విధంగా వృద్ధులకూ ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు గురించీ సమాలోచనలు జరుపుతోంది. దీంతో పాటు విద్యార్థుల సమస్యకూ పరిష్కారాన్ని వెతికే పనిలో పడింది. వారు వెళ్లే మార్గంలో కొన్ని ప్రత్యేక సర్వీసులు నడపాలా? అనే ఆలోచనలపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News