Wednesday, January 22, 2025

చిన్నారులకు ఆర్‌టిసి పెద్ద కానుక

- Advertisement -
- Advertisement -

Free bus travel for children under 12 years of age

12ఏళ్ల లోపు పిల్లలకు బస్సులో శాశ్వతంగా ఉచిత ప్రయాణం

టిఎస్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

మనతెలంగాణ/హైదరాబాద్ : తొందరలోనే 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బస్ భవన్‌లో శనివారం జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి ఉద్యోగులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల ఆదరణ కోసం కొత్త పథకాలను అమలు చేస్తామన్నారు.

పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని, దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉందన్నారు. సంస్థ చైర్మన్‌గా తనను, ఎండిగా సజ్జనార్‌ను నియమించిన తరువాత ఉద్యోగులందరూ ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారని వారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఉద్యోగుల్లో నిరాశ ఉండేదని ఇప్పుడది లేదన్నారు. కొత్త ఆశలు చిగురించాయని, సంస్థ పట్ల నమ్మకం పెరిగిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ ఉద్యోగుల సమస్యలను ఈ సంవత్సరంలో కచ్చితంగా పరిష్కరిస్తామని, ఆ మేరకు చర్యలు చేపడుతున్నామని ఎండి సజ్జనార్ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News