Monday, December 23, 2024

రెండు రాష్ట్రాలలోనూ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు : మెగాస్టార్ చిరంజీవి వెల్లడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉచిత క్యాన్సర్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ ప్రైవేటు హాస్పిటల్‌తో కలిసి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను త్వరలోనే ప్రారంభించనున్నామని అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ  ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంపిక చేసిన కొన్ని కేంద్రాలలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను నెలకు ఒక సారి ఉచితంగా చేపడుతున్నామని వివరించారు. వీలు వెంబడి క్రమ క్రమంగా ఈ సేవలను విస్తరిస్తామనీ అన్నారు.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లతో సహా దక్షిణాది రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా అనేక ఆధునిక ఉత్తమ పరికరాలు, రోగ నిర్ధారణ విధానాలతో కూడిన ఆధునాతనమైన క్యాన్సర్ చికిత్సా కేంద్రం నెలకొల్పి, దానికి అనుబంధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించటానికి ముందుకు వచ్చిన ఆ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాన్ని చిరంజీవి ఈ సందర్భంగా అభినందించారు. తొలి విడతగా హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆవరణలో గుర్తింపు కార్డు ఉన్న సినీ కార్మికుల కుటుంబ సభ్యులందరూ వచ్చే నెల అంటే జూలై 9న రోజంతా జరిగే ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరిర్‌క్షించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని ఉభయులూ ఆకాంక్షించారు. ఇది తమ సమిష్టి కృషిలో తొలి అడుగులేనని మరిన్ని ఉత్తమ ఆశయాల సాధనకు తాము ఉమ్మడిగా కట్టుబడి ఉన్నామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులలో నిర్ధారితమైన క్యాన్సర్ బాధితులకు తదుపరి చికిత్సావకాశాలు, సూచనలు, సలహాలు తదితరం అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News