Monday, December 23, 2024

బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free Coaching for bank jobs

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్) ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 8,106 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో తెలంగాణలో గ్రామీణ బ్యాంకులో 459 ఆఫీస్ అసిస్టెంట్‌లు, 159 ఆఫీసర్ స్కేల్, ఖాళీలు ఉన్నాయి. జూన్ 27 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు ఆగష్టు లేదా సెప్టంబర్‌లో ఐబిపిఎస్ ద్వారా నిర్వహించబడుతాయి. డిసెంబర్‌లోగా అన్ని ప్రక్రియలు ముగిసి ఎంపికైన అభ్యర్థులకు ఆపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇవ్వబడుతుంది. తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగణ బిసి స్టడి సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్ కుమార్ కోరారు. తెలంగాణ బిసి స్టడి సర్కిల్ ద్వారా వెయ్యి మంది అభ్యర్థులకు 45 రోజులు ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పించబడుతుందని తెలిపారు. మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు.

జిల్లాకు 30 మంది చొప్పున శిక్షణ కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జులై 1 నుండి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ లో వెబ్‌సైట్ tsbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి అని తెలిపారు. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని, మరిన్ని వివరాలకు 04024071178, 04027077929 నెంబర్‌కు సంప్రదించాలన్నారు. ఉచిత కోచింగ్‌కు అభ్యర్థుల ఎంపికలో బిసి 75 శాతం, ఎస్‌సిలు 15 శాతం, ఎస్‌టిలు 5 శాతం, ఇడబ్లుఎస్/వికలాంగులు, ఇతరులు 5 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News