మనతెలంగాణ/ హైదరాబాద్ : వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమై దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును 11వ తేదీ వరకు పొడిగించినట్లు దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. సదరం సర్టిఫికేట్ 40 శాతం వైకల్యం ఉన్న అభ్యర్థులు, వినికిడి లోపం కలిగిన వికలాంగులకు ఈ శిక్షణను ఇవ్వనున్నారు. ఉచిత శిక్షణను పొందేందుకు అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.20 వేలు లేదా 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అదే విధంగా ప్రతి అభ్యర్థికి రూ. 7 వేలతో పాటు రూ. వేయి బోధన సామగ్రిచ, ఇతర ఖర్చుల కోసం రూ.2 వేలు ఇవ్వనున్నారు. టివిసిసి నుంచి ఇప్పటికే పొందిన అభ్యర్థులు అర్హులు కాదని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు www.tvcc.telangana.gov.in, www.wdsc.telangana.gov.inలో దరఖాస్తులను పొందాలని సూచించారు. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులను అందజేయాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారికి దరఖాస్తులను అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబరు 040 -24559048లో సంప్రదించాలని కోరారు.