Thursday, January 23, 2025

గిరిజన శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హత గల ఎస్‌సి, ఎస్‌టి, బిసి అభ్యర్థులకు ఐబిపిఎస్ (బ్యాంకింగ్) పరీక్షల కోసం హైదరాబాద్ బుద్ద భవన్‌లోని పిఇటిసిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలపారు. ఆగష్టు 5వ తేది నుండి రెండు నెలల పాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎస్‌టిలకు 75, ఎస్‌సిలకు 15, బిసిలకు 10 సీట్లు కేటాయించారు.

ఇందులో మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించబడ్డాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆసక్తి గల అర్హులైన ఎస్‌టి, ఎస్‌సి, బిసి అభ్యర్థులు http://studycircle.cgg.gov.in/tstw వెబ్‌సైట్‌లో అన్‌లైన్ ద్వారా జులై 14 నుండి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సంధరంగా స్టైఫండ్, బుక్ మెటీరియల్ ఇవ్వనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. మరిన్ని వివరాలకు పనిరోజుల్లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5గంటల వరకు 83094944387 ను సంప్రదించాలని సూచించారు.

Free Coaching to Bank Exams by TS Tribal Ministry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News