Wednesday, December 25, 2024

బెల్లాల్ గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బోధన్ సన్ డెంటల్ ఆసుపత్రి వైద్యుల సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దంత వైద్యులు రవికుమార్ గ్రామస్తులకు దంతాలకు సంబంధించిన వైద్యాన్ని అందించారు. దంతాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాధిగ్రస్తులకు పలు సూచనలు చేశారు. దంతాలు సురక్షితంగా ఉంచుకోవడానికి గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామావత్ రాజు, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సురేష్, హాస్పిటల్ సిబ్బంది వసంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News