కంటెంట్ డౌన్‌లోడ్, స్ట్రీమ్ చేయడం వంటివి అందిస్తున్న షుగర్ బాక్స్
పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్‌మెంట్ సాంకేతికతను వినియోగం
నగరంలో 10 ప్రధాన మెట్రో స్టేషనల్లో ప్రయాణికులకు సేవలు
త్వరలో సినిమాలు, క్రీడలు, సంగీతం వంటి వినోదం అందించేందుకు ప్లాన్
హైదరాబాద్: నగర ప్రజలు సేవలందిస్తున్న మెట్రో రైల్ షుగర్‌బాక్స్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా సౌకర్యవంతమైన, బఫర్‌కానటువంటి రీతిలో ప్రయాణ సమయంలో కూడా అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మెట్రో రైల్, సెల్యులార్ నెట్‌వర్క్ లేకపోయినప్పటికి తమ ప్రయాణీకులకు ఉచితంగ కంటెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడం, సీమ్ చేయడానికి తగిన అవకాశాలను షుగర్ బాక్స్ ద్వారా అందిస్తోంది. దీనికోసం కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్‌మెంట్ సాంకేతికతను వినియోగించింది. దీనిద్వారా అన్ని మెట్రోరైళ్లతో పాటుగా నగర వ్యాప్తంగా 10 ప్రధాన మెట్రో స్టేషనలలో సేవలను అందిస్తోంది. ఈసేవలను వినియోగించుకోవడం కోసం వినియోగదారులు సైన్ ఇన్‌కావాల్సి ఉంటుంది. తద్వారా వినోదం, విద్య, ఈకామర్స్, ఫిన్‌టెక్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈమేడ్ ఇన్ ఇండియా ఆవిష్కరణ, విమానాలలో ఏవిధమైన అనుభవాలను పొందగలరో అదే తరహా అనుభవాలను మెట్రోరైల్ ప్రయాణీకులకు అందిస్తోంది.
షుగర్ బాక్స్ నెట్‌వర్క్ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులు సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. వారు తమ ప్రయాణ సమయంలో ఒకటి కంటే అధిక చిత్రాలను చూడటమో, డౌన్‌లోడ్ చేయడమో చేస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ, జెర్సీ, వరుడు కావలెను, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇస్మార్ట్ శంకర్, రంగ్‌డే ,సోలో బ్రతుకే సోబెటర్, కో కో కోకిల వంటివి వీరు అధికంగా షుగర్ బాక్స్ యాప్‌పై చూశారు. అంతేకాదు మద్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు షుగర్ బాక్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిజిటల్ ఇండియా మిషన్ అనుగుణంగా, షుగర్ బాక్స్ ఇప్పుడు చెన్నై మెట్రో, సెంట్రల్ రైల్వేలో కూడా సేవలనందిస్తోంది. అలాగే సీఎస్‌సీఈ గవర్నెన్స్‌తో భాగస్వామ్యం చేసుకుని మారుమూల ప్రాంతాల్లో సైతం తమ సేవలను అందిస్తోంది. భారతదేశపు ఇంటర్నెట్ పర్యావరణ వ్యవస్దను విప్లవాత్మీకరించడానికి ఈ కంపెనీ కట్టుబడి ఉంది. 2024 నాటికి 350 మిలియన్‌ల మంది భారతీయులపై ప్రభావం చూపడానికి లక్షంగా పెట్టుకుంది. త్వరలో ఇది సినిమాలు వీక్షించడం, క్రీడలు ఆడటం, సంగీత వినడం, ఆన్‌లైన్‌లో గ్రోసరీ ఆర్డర్ చేయడం, క్యాబ్స్ బుక్‌చేయడం, ఎడ్‌టెక్‌యాప్ వినియోగించుకుని వినియోగదారులు అదనపు నైపుణ్యాలను పొందడంలోను సహాయపడునుంది.