Monday, December 23, 2024

విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

జోగిపేట: ఎడ్యుకేషన్ అండ్ ఎం రీచ్ ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంగళవారం అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సంస్థ వారితో కలిసి అందోల్, జోగిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని చదువుకున్న పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బ్యాగులు పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థను ఆయన అభినందించారు. చిన్నారులతో నాట్యంతో అందరిని ఆకట్టుకున్నారు. షౌండేషన్ వారు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News